KRNL: దేవనకొండలోని క్రాస్ రోడ్డులో పెద్ద గొయ్యి ఏర్పడి ప్రమాదకరంగా మారింది. నిత్యం కర్నూలు నుంచి బళ్లారికి వందల సంఖ్యలో వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. రోడ్డుపై దాదాపు అడుగున్నర లోతు ఏర్పడ్డ ఈ గుంత వల్ల వాహనదారులు అదుపుతప్పి కిందపడి గాయాలపాలవుతున్నారు. ఆర్&బి అధికారులు స్పందించి రోడ్డుకు మరమ్మతులు చేయాలని వాహనదారులు కోరుతున్నారు.