NDL: సంజామల మండల పరిధిలోని ముచ్చలపురిలో గణనాధుని ఇవాళ లడ్డూను గణేష్ ఉత్సవ కమిటీ నిర్వాహకులు వేలంపాట నిర్వహించారు. ఇందులో భాగంగా పలువురు పోటీ పడగా.. అత్యధికంగా ఈర్ల బాలకృష్ణుడు యాదవ్ రూ. 75000తో స్వామివారి లడ్డు ప్రసాదాన్ని దక్కించుకున్నారు. ఈ కార్యక్రమంలో అమీర్ దొర, ఈర్ల శ్రీకాంత్, రామ గుర్రప్ప యాదవ్, కె.పెద్దిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.