ASR: అనంతగిరి ఎంపీడీవో కార్యాలయంలో శనివారం P4 కార్యక్రమంపై మండల ప్రత్యేక అధికారి డా.స్వామి నాయుడు మండల స్థాయి అధికారులతో సమావేశం నిర్వహించారు. ప్రత్యేక అధికారి మాట్లాడుతూ.. మండలంలో గుర్తించిన బంగారు కుటుంబాలను దత్తత తీసుకోవడానికి స్వచ్చందంగా ముందుకొచ్చిన మార్గదర్శకులకు సహాయ సహకారాలను అందించాలని సూచించారు. మండలంలో పీ4 కార్యక్రమం విజయవంతం చేయాలని కోరారు.