TPT: చంద్రగిరి నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి రంజాన్ పర్వదినం సందర్భంగా ఇవాళ విస్తృతంగా పర్యటించనున్నారని వైసీపీ నాయకులు తెలిపారు. ఉదయం 8.30 గంటలకు చంద్రగిరి పట్టణ ఈద్గా మైదానం, 9.30 గంటలకు చిన్నగొట్టిగల్లు, 10.15 గంటలకు దీన్దార్లపల్లి ఈద్గా మైదానాలను సందర్శించి ముస్లిం సోదరులను కలిసి శుభాకాంక్షలు తెలియజేయనున్నారు.