CTR: బైకులపై ప్రయాణించేవారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని ట్రాఫిక్ CI లక్ష్మీనారాయణ సూచించారు. చిత్తూరు చర్చి వీధిలో హెల్మెట్ వాడకంపై శనివారం అవగాహన కల్పించారు. ప్రమాదాలలో తలకు గాయం కావడంతోనే అధిక శాతం మంది చనిపోతున్నట్లు ఆయన తెలియజేశారు. హెల్మెట్ ధరించడం చట్టపరమైన అంశమే కాకుండా కుటుంబ భద్రతకు సంబంధించిన విషయమని వివరించారు.