VSP: హరే కృష్ణ ఉద్యమ వ్యవస్థాపకులు శ్రీశ్రీల భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి 48వ తిరోభావ దినోత్సవం, దామోదర దీపోత్సవం శనివారం సాయంత్రం భీమిలిలోని ఐఐఎం రోడ్లోని హరే కృష్ణ వైకుంఠంలో అంగరంగ వైభోగంగా నిర్వహించారు. సాయంత్రం 6 గంటలకు ప్రారంభమైన ఈ కార్యక్రమంలో ముందుగా శ్రీశ్రీల భక్తి వేదాంత స్వామి ప్రభుపాదులవారి విగ్రహానికి అభిషేకం నిర్వహించారు.