ATP: జిల్లాలో నేటి నుంచి పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 34 పరీక్ష కేంద్రాలలో 8,430 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థులు ఎలాంటి అసౌకర్యాలకు గురికాకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:45 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి.