ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని 13 డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాలలో 6 తరగతి నుంచి 10 తరగతి వరకు ఉన్న ఖాళీలకు ప్రవేశ పరీక్ష 8వ తేదీ జరుగుతుందని జిల్లా కోఆర్డినేటర్ జయ తెలిపారు. విద్యార్థినీలు హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకుని ఆధార్ కార్డు జిరాక్స్ కాపీతో పరీక్షకు హాజరు కావాలన్నారు. విద్యార్థులు పరీక్షా కేంద్రానికి అరగంట ముందే హాజరుకావాలని సూచించారు.