ASR: అరకులోయ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శుక్రవారం అంతర్జాతీయ అటవీ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. మానవుని అభివృద్ధి అడవులతోనే ముడిపడివుందని ముఖ్య అతిథిగా హజరైన అరకులోయ ఎఫ్ఆర్వో కోటేశ్వరరావు అన్నారు. అటవీ సంరక్షణ కొరకు ప్రజల సహకారం చాలా ముఖ్యమని అన్నారు. అడవులు-ఆర్థిక వ్యవస్థ అనే అంశంపై విద్యార్ధులకు అవగాహన పరిచారు.