KDP: ప్లాస్టిక్ కవర్లకు ప్రత్యామ్నాయంగా జ్యూట్, క్లాత్ బ్యాగులను వాడాలని మున్సిపల్ కమిషనర్ ముని కుమార్ సూచించారు. బుధవారం పట్టణంలోని స్థానిక ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపల్ శ్రీనివాసులు ఆధ్వర్యంలో బ్యాన్ ఆఫ్ సింగల్ యూజ్ ప్లాస్టిక్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ప్లాస్టిక్ వాడకూడదని ప్రతి ఒక్కరికీ అవగాహన ఉండాలని తెలిపారు.