SKLM: శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ తన క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ మేరకు ఎమ్మెల్యే కార్యాలయం గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి 2 గంటల వరకు ప్రజల నుంచి ఎమ్మెల్యే శంకర్ నేరుగా ఫిర్యాదులు తీసుకుంటారని అని పేర్కొన్నారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.