W.G: మున్సిపల్ కాంట్రాక్టు కార్మికుల జీతాలు ప్రతినెల సకాలంలో చెల్లించాలని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు కోనాల భీమారావు, సీఐటీయూ జిల్లా కార్యదర్శి పీవీ ప్రతాప్ కోరారు. గురువారం తణుకులో కార్మికుల సమస్యల పరిష్కారానికి ధర్నా చేసి అనంతరం మున్సిపల్ కమిషనర్ రామ్ కుమార్కు వినతి పత్రాన్ని అందజేశారు. కార్మికులకు అవసరమైన పనిముట్లు ఇవ్వాలని కోరారు.