విశాఖలో ఐటీ రంగాన్ని మరింత విస్తరించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కాపులుప్పాడలోని సుమారు 300 ఎకరాల గ్రేహౌండ్స్ భూమిని ప్రత్యేక ఆర్థిక మండలిగా అభివృద్ధి చేయాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్లు, డేటా హబ్‌ల స్థాపనకు ఈ ప్రాంతం అనుకూలంగా ఉండటంతో ఐటీ సంస్థలను ఆకర్షించే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు.