E.G: రాజమండ్రిలోని ఎఫ్సీఐ గోదాంలో భద్రపరచిన 2024 ఎన్నికల ఈవీఎంలను మంగళవారం నెలవారీ తనిఖీల్లో భాగంగా పరిశీలించినట్లు DRO టి.సీతారామ మూర్తి తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘాల మార్గదర్శకాలు & కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ తనిఖీలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా గోదాంలో ఉన్న ఈవీఎంల భద్రతా ఏర్పాట్లు, సీసీ కెమెరాల పనితీరును సమీక్షించారు.