ATP: మహబూబ్నగర్ పరిధిలో సిగ్నల్ పనులు పూర్తికావడంతో గుంతకల్-కాచిగూడ ప్యాసింజర్ రైలును అధికారులు పునః ప్రారంభించారు. ఈ రైలు తుగ్గలి, పెండేకల్లు, డోన్, కర్నూలు మీదుగా నడుస్తుంది. సిగ్నల్ పనులు ముగిసిన వెంటనే రైలు మళ్లీ పట్టాలెక్కడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా ప్రయాణికులకు ఈ రైలు ఉపయోగపడనుంది.