E.G: రాజానగరం మండలం స్వరూపనగర్ లో కల్తీ పాలు తాగి చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయిన ఇసనపల్లి అర్చన కుమారుడు మనోహర్ కుటుంబాన్ని MLA బత్తుల బలరామకృష్ణ శనివారం పరామర్శించారు. అనంతరం కుటుంబానికి సీఎం చంద్రబాబు CMRF నుంచి మంజూరు చేసిన రూ.10 లక్షల చెక్కును బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. బాధిత కుటుంబానికి కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.