VSP: గిరిజనులకు మెరుగైన వైద్యం అందించాలని అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం కోరారు. గురువారం ఆయన విశాఖ కేజీహెచ్‌ను సందర్శించారు. సూపరింటెండెంట్ డాక్టర్ వాణిని కలిశారు. గిరిజన ప్రాంతం నుంచి కేజీహెచ్‌కు వచ్చే గిరిజన రోగులకు మెరుగైన వైద్యం అందించాలని కోరారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే రోగులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని కోరారు.