VZM: బొండపల్లి పోలీసు స్టేషన్ పరిధిలో మద్యం సేవించి వాహనం నడిపిన ఇద్దరు నిందితులకు 7 రోజుల జైలు శిక్ష విధించారు. కొర్లాం గ్రామానికి చెందిన బి.హేమంత్, విజయనగరం పట్టణానికి చెందిన అడపాక సాయిలను నవంబర్ 18న నిర్వహించిన డ్రంక్ & డ్రైవ్ తనిఖీల్లో పోలీసులు పట్టుకున్నారు. కోర్టు ఇద్దరికీ జైలు శిక్షను విధించినట్లు ఎస్పీ దామోదర్ మంగళవారం తెలిపారు.