PPM: గరుగుబిల్లి మండల ప్రజా పరిషత్లో కో-ఆప్ట్ సభ్యుడి అనుబంధ ఖాళీకి సంబంధించిన ఎన్నిక గురువారం ఎంపీడీవో కార్యాలయంలో సజావుగా జరిగింది. ఈ ఎన్నికకు పరిశీలకుడిగా జాయింట్ కలెక్టర్ సి.యశ్వంత్ కుమార్ రెడ్ది హాజరై మొత్తం ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షించారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ జారీ చేసిన నియమాలు, మార్గదర్శకాలకు అనుగుణంగా శాంతియుతంగా నిర్వహించబడింది.