ATP: గుత్తి ఆదర్శ పాఠశాలలో శనివారం పాలిసెట్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. పరీక్ష కేంద్రం వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. పరీక్ష కేంద్రానికి అరగంట ముందుగానే విద్యార్థులు చేరుకున్నారు. ఉదయం 11 నుంచి 1:00 వరకు ఈ పరీక్షలు జరుగుతాయని పాఠశాల ప్రిన్సిపాల్ ప్రశస్తకుమారి తెలిపారు.