KRNL: కూటమి నాయకుల బెదిరింపులకు భయపడేది లేదని మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కుమారుడు అమర్నాథ్ అన్నారు. మంగళవారం డోన్‌లో వైసీపీ నాయకులు, కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ ఐదేళ్లలో ఇబ్బందులకు గురిచేసిన వారిని ఎంత మాత్రం క్షమించబోమని అన్నారు.