KRNL: హైదరాబాద్ ఉప్పల్లో కర్నూలు జిల్లాకు చెందిన AR కానిస్టేబుల్ సుధీర్ దారుణ హత్యకు గురయ్యారు. ఆదివారం రాత్రి పాత స్నేహితుడు, ఆటో డ్రైవర్ సంతోష్ నాయక్ కత్తితో సుధీరైపై దాడి చేశాడు. తీవ్రంగా గాయపడ్డ ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. వాట్సాప్ చాటింగ్లో వీరి మధ్య జరిగిన వివాదమే ఈ ఘాతుకానికి దారితీసినట్లు తెలుస్తోంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.