W.G: ఆచంట నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ చెరుకువాడ శ్రీరంగనాథరాజు ఆదేశాల మేరకు కొడమంచిలికి చెందిన కె.శశిమధును ఆచంట మండల వైసీపీ యువజన విభాగ అధ్యక్షునిగా నియమించారు. మండలంలో యువజన విభాగాన్ని బలోపేతం చేస్తానని కె. శశిమధు హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం యువతకు ఇచ్చిన హామీలు అమలయ్యే వరకు పోరాటం చేస్తామని ఆయన పేర్కొన్నారు.