CTR: మహిళా దినోత్సవ వారోత్సవాలలో భాగంగా చిత్తూరు మహిళా సీఐ శ్రీనివాస్ రావు ఆధ్వర్యంలో సాయుధ దళ బ్యాండ్ షో, విద్యార్థినుల అవగాహన ర్యాలీ శనివారం నిర్వహించారు. సాయుధ దళ కార్యాలయం నుంచి ర్యాలీ ప్రారంభించారు. మహిళల భద్రత, సమాన హక్కులు, మహిళా సాధికారతపై అవగాహన కల్పించారు. ఈ మేరకు ప్రతిజ్ఞ చేశారు.