CTR: చౌడేపల్లె మండలానికి చెందిన వైసీపీ నాయకురాలు గాయపడ్డారు. వివరాల్లోకెళ్తే షికారిపాలేనికి చెందిన వైసీపీ నాయకురాలు అనుప్రియ కాగతి పంచాయతీలో నిర్వహించిన పార్టీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ మేరకు తిరిగి చౌడేపల్లెకు బైకుపై వస్తుండగా కొండామరి వద్ద కుక్కలు అడ్డు రావడంతో అదుపుతప్పి పడిపోయారు. దీంతో ఆమెను మదనపల్లె ఆసుపత్రికి తరలించారు.