VZM: ఎస్‌కోట మండలం దారపర్తి పంచాయతీ పరిధిలో 15 గిరిజన గ్రామాలకు శాశ్వత రోడ్డు సౌకర్యం కల్పించాలని నియోజకవర్గ జనసేన నాయకులు వబ్బిన సన్యాసినాయుడు కోరారు. ఈ మేరకు సోమవారం ఆయా గ్రామాలకు గిరిజనులతో కలిసి కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. రోడ్డు సౌకర్యం లేక గిరిజనులు డోలీపై రోగులను ఆసుపత్రికి తీసుకువెళ్లాల్సిన పరిస్థితి నెలకొందని మండిపడ్డారు.