GNTR: పొన్నూరు మండల పరిధిలోని దివ్యాంగుల వైకల్యం నిర్ధారణ కోసం ఈ నెల 14వ తేదీ నుంచి సదరం స్లాట్ బుకింగ్ ప్రారంభమవుతుందని ఎంపీడీవో చంద్రశేఖరరావు తెలిపారు. నవంబర్, డిసెంబర్ నెలలకు స్లాట్లు అందుబాటులో ఉంటాయని చెప్పారు. అర్హులైన దివ్యాంగులు వెంటనే గ్రామ, వార్డు సచివాలయాల్లో సంప్రదించి స్లాట్ బుక్ చేసుకోవాలని ఆయన సూచించారు.