KRNL: కర్నూలులోని ఓ PSలో పనిచేస్తున్న నలుగురు క్రైం పార్టీ సిబ్బంది అవినీతి చర్చనీయాంశమైంది. ఇటీవల ఓ చోరీ కేసులో HYDకు చెందిన వ్యాపారిని కర్నూలుకు తీసుకొచ్చారు. మార్గమధ్యంలో శివరాంపల్లి వద్ద అతనితో బేరం కుదుర్చుకుని డబ్బులు ఫోన్ పే చేయించుకున్నారు. ఈ విషయంపై ఆ వ్యాపారి తెలంగాణ ప్రజాప్రతినిధుల ద్వారా AP DGPతో మాట్లాడించగా, శనివారం ఆయన విచారణకు ఆదేశించారు.