KRNL: ఆలూరు నియోజకవర్గం హొళగుంద మండలంలోని ఎల్లార్తి గ్రామానికి చెందిన 13 మందిపై ఎస్సై గురజాల దిలీప్ కుమార్ బైండోవర్ కేసు నమోదు చేసినట్లు బుధవారం తెలిపారు. ఈ నెల 18 నుంచి 20 వరకు జరగనున్న ఉరుసు నేపథ్యంలో ముందస్తు చర్యల్లో భాగంగా వీరిని బైండోవర్ చేసి తహసీల్దార్ సమక్షంలో హాజరుపరిచారు. గ్రామాల్లో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.