KKD: తుని పట్టణంలో నేటి నుంచి మంచినీటి సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని మున్సిపల్ కమిషనర్ వెంకట్రావు శుక్రవారం ప్రకటనలో తెలిపారు. పోలవరం ప్రాజెక్టు ఎడమ కాలువ పనులు కారణంగా నీటి సరఫరాకి అంతరాయం ఉంటుందని తెలిపారు. తుని పట్టణంలో ఒకటో వార్డు నుంచి 10వ వార్డు వరకు ఈ రోజు నుంచి 28వ తేదీ వరకు రేఖ వాణి పాలెంలో లైన్ మార్పు కారణంగా మంచినీరు తక్కువగా వస్తాయన్నారు.