SS: జిల్లాలో వివిధ మండలాల్లో గురువారం నుంచి శుక్రవారం ఉదయం వరకు భారీ వర్షాలు కురిశాయి. మడకశిర మండలం గోవిందపురంలో అత్యధికంగా 76.25 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని అధికార వర్గాలు తెలిపాయి. సీ.కొడిగేపల్లి మండలంలో 60.5, కొక్కంటి 42.5, ఎర్రమంచి 37, పారిగి 36.25, కొండకమర్ల 36.25, గంజివారిపల్లె 36 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని వాతావరణ విభాగం వివరించింది.