E.G: ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కోడిపందాలు యధేచ్ఛగా సాగుతున్నాయి. సంక్రాంతి సంప్రదాయం పేరుతో నిర్వహిస్తున్న కోడిపందాలలో బరులు రక్తమోడుతున్నాయి. కోడిపందాలు, జూదాలపై ఉక్కుపాదం మోపుతాం అంటూ ప్రచారం చేసిన అధికారగణం భోగిరోజు నుంచి మూగబోయింది. దీనితో ఎక్కడ చూసిన కోడి పందాలు, జూద క్రీడలు యదేచ్చగా కొనసాగుతున్నాయి.