KMR: రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని ఎవరు నిరాశ చెందవద్దని జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. ఆదివారం మద్నూర్, హండె కేలూర్ గ్రామాల్లో కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఎన్నికల్లో గెలుపొందిన సర్పంచ్లు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులకు అభినందనలు తెలిపారు. కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరినట్లు చెప్పారు.