TG: కేసీఆర్ పదేళ్లు సీఎంగా ఉండి తెలంగాణను రావణ రాజ్యంలా మార్చారని ఎంపీ చామల కిరణ్ కుమార్ మండిపడ్డారు. కేసీఆర్ దౌర్భాగ్యమైన పాలన వల్లనే ప్రజలు రేవంత్‌కి సీఎంగా అవకాశం ఇచ్చారని అన్నారు. కాంగ్రెస్ పాలనలో తెలంగాణ అభివృద్ధి పతంలో దూసుకెళ్తుందని చెప్పారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పాలనను ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు.