KDP: ఖాజీపేట మండల కేంద్రంలోని పంచాయతీ కార్యాలయం సమీపంలో బుధవారం విషాదకర సంఘటన చోటుచేసుకుంది. ఖాజీపేట గ్రామానికి చెందిన బింగమల శివకుమార్ అనే యువకుడి కాలుపై నుంచి బస్సు వెళ్లడంతో తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో శివకుమార్ కాలు నుజ్జునుజ్జు కావడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.