కర్నూల్ జిల్లా (Kurnool District) ఒర్వకల్లు మండలంలో తాగు నీరు కలుషితం (Waterpolluted) కలకలం సృష్టిస్తోంది. కలుషిత నీరు తాగి 40 మంది ఆస్పత్రిపాలు కావటం ఇప్పుడు సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది. ఒక్కసారిగా వారికి వాంతులు, విరోచనాలు కావడంతో వెంటనే వారిని ప్రభుత్వ హాస్పటల్ (Government Hospital) కు తరలించారు.. ప్రస్తుతం వారంతా కోలుకుంటున్నారు.. ఇది ఇలా ఉంటే హెల్త్ కమ్యూనిటీ సెంటర్ లో అడ్మిట్ అయిన వారిని పరామర్శించిన డి య్యం హెచ్ ఓ, (DMHO) ఆర్డిఓ, తాసిల్దార్, ఎంపీడీవో, డిపిఓ, డి ఎల్ పి ఓ తదిత అధికారులు పరామర్శించారు, మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్య అధికారులను కోరారు.
ఓర్వకల్ (Orvocal )గ్రామంలోని వీధులను పరిశీలించారు. ఇంటింటికి వెళ్లి రోగులను యోగ క్షేమంగా అడిగి తెలుసుకున్నారు. 108 వాహనం వైద్యశాలలో ఉంచుతామని అత్యవసరమైతే కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరుగుతుందన్నారు. జిల్లా కలెక్టర్ (District Collector) ఆదేశాల మీదకి రావడం జరిగిందని గ్రామంలోని నీటిని నీటిని లాబరేటరీ (Laboratory) కి తరలించినట్లు ఆర్డీవో తెలిపారు. . మంచినీళ్ల పైప్ లైన్ డ్రైనేజ్ పైప్ లైన్ (Drainage pipe line) రెండు కలిపి ఉండడం వల్ల నీరు కలుషితమైందని అంటున్నారు. గాజు గ్లాసులో ఉన్న నీళ్లు ప్రభుత్వం సరఫరా చేస్తున్న మంచినీళ్లు. శుద్ధమైన, సురక్షితమైన మంచినీరు సరఫరా కావాల్సిన పంపుల్లో కంపు నీరు వస్తుందన్న విషయం క్లియర్గా అర్థమవుతోంది. ఈ రంగు మారిన నీళ్లనే బస్తీవాసులు మంచినీళ్లుగా వాడుతున్నారు.