అన్నమయ్య: ప్రపంచ క్షయ నివారణ దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ టీబీ ముక్త్ భారత్ అభియాన్‌కు శ్రీకారం చుట్టారు. 100 రోజుల పాటు మూడు దశల్లో కార్యక్రమాన్ని అమలు చేస్తూ హై రిస్క్ గ్రామాల్లో ప్రత్యేక శిబిరాలు నిర్వహించనున్నారు. ఛాతీ ఎక్స్-రే సహా పరీక్షలు చేసి వివరాలను నిక్షయ్ పోర్టల్‌లో నమోదు చేయాలని ఆదేశించారు.