కాకినాడ జిల్లా పిఠాపురం మండలం జల్లూరు గ్రామంలో కలెక్టర్ ఎం. ఎన్. హరేంధిర ప్రసాద్ గురువారం అంగన్వాడీ కేంద్రాలను సందర్శించారు. అక్కడ అందుతున్న సేవలపై ఆరా తీసిన ఆయన.. ముఖ్యంగా చిన్న పిల్లల ఆరోగ్యం, పౌష్టికాహారం పంపిణీ తీరును స్వయంగా అడిగి తెలుసుకున్నారు. అనంతరం అంగన్వాడీ కేంద్రాల్లోని రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. అలాగే, చిన్నారులతో సరదాగా ముచ్చటించారు.