కృష్ణా: ఉంగుటూరులో పెద్ద ఆవుటపల్లి జోసఫ్ తంబీ తిరునాళ్లలో గ్రామ పంచాయతీ అధికారులు వ్యాపారులపై అధిక వసూళ్లకు పాల్పడుతున్నారని గతంలో పలు ఆరోపణలు వచ్చాయి. 3 రోజుల పాటు ఏర్పాటు చేసిన దుకాణాల దగ్గర అదనపు వసూళ్ల పేరుతో అధిక వసూలు జరుగుతున్నట్లు వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.పెట్టుబడి, లాభాల కంటే ఎక్కువ భారంతో నష్టాలు ఎదుర్కొంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.