ATP: ఈనెల 11, 12 తేదీలలో రాష్ట్ర ఆహార కమిషన్ సభ్యురాలు గంజి మాల దేవి జిల్లాలో పర్యటించినున్నారని కలెక్టర్ ఆనంద్ మంగళవారం తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో జాతీయ ఆహార భద్రత చట్టం 2013 అమలులో భాగంగా పీడీఎస్, ఎండీఎం, ఐసీడీఎస్ ఇతర సంక్షేమ పథకాల అమలు తనిఖీ చేయడానికి ఆమె పర్యటించనున్నారని పేర్కొన్నారు.