AKP: చోడవరం నుండి వడ్డాది వెళ్లే ఆర్ అండ్ బి రహదారిపై విజయరామరాజుపేట వద్ద కూలిపోయిన వంతెన ప్రక్కన తాత్కాలికంగా నిర్మించిన అప్రోచ్ రోడ్డు శిధిల స్థితికి చేరుకుంది. ఈ రోడ్డును పట్టిష్టంగా నిర్మించాలని జనసేన ఇన్చార్జి పీవీఎస్ ఎన్ రాజు కోరుతున్నారు. ఆదివారం సాయంత్రం పార్టీ కూటమి నాయకులతో కలిసి అప్రోచ్ రోడ్డును పరిశీలించారు.