EG: రాజమండ్రి 13వ వార్డు తాడితోట అంబేద్కర్ నగర్లోని డ్రైనేజీ నిర్మాణ పనులను గురువారం చేపట్టారు. ఈ సందర్భంగా BJP ఓబీసీ మోర్చా తూ.గో జిల్లా కోశాధికారి పోలవరపు రాము పనులను పరిశీలించారు. డ్రైనేజీ నిర్మాణంలో పనులు వేగవంతం చేసి, నాణ్యత ప్రమాణాలు పాటించాలని ఆయన సూచించారు. డ్రైనేజీ నిర్మాణంతో ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.