కర్నూలులో హెచ్పీవీ టీకా కార్యక్రమాన్ని ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీ.జి .భరత్ ఇవాళ ప్రారంభించారు. 14–15 సంవత్సరాల అమ్మాయిలకు గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణకు ప్రభుత్వం ఉచితంగా హెచ్పీవీ టీకా అందిస్తున్నదని తెలిపారు. ప్రజలు ఆరోగ్యంపై ముందు జాగ్రత్తగా ప్రభుత్వ వైద్య సేవలను తప్పకుండా వినియోగించుకోవాలని మంత్రి సూచించారు.