చిత్తూరు జిల్లా టమాటా పంటకు పెట్టింది పేరు. ఆసియాలోనే అతి పెద్ద టమాటా మార్కెట్‌గా పేరు గడించింది. రోజుకు 1,500 టన్నుల పంటకు ఇక్కడ వేలం నిర్వహించే అవకాశం ఉంది. ఇంత ఉన్నా రైతులు మాత్రం నష్టాలతో పంటను సాగు చేస్తున్నారు. ఏళ్ల తరబడి పాలకులు టమాటో ప్రొసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేస్తామని చెబుతున్నా కార్యరూపం మాత్రం దాల్చలేదు.