NLR: ఏపీ ఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ మాలేపాటి సుబ్బానాయుడు మృతి చెందారు. బ్రెయిన్ స్టోక్తో గత 10 రోజులుగా విజయవాడలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాలేపాటి ఆదివారం రాత్రి తుది శ్వాస విడిచారు. శనివారం రాత్రి మాలేపాటి అన్న కుమారుడు బాను గుండెపోటుతో మృతి చెందిన విషయం తెలిసిందే. అంతక్రియలు ఇవాళ దగదర్తిలో నిర్వహించనున్నట్లు సమాచారం.