KDP: ప్రొద్దుటూరులో శనివారం, ఆదివారం 2 రోజులపాటు తాగునీటి సరఫరాకు అంతరాయం ఉంటుందని స్థానిక మున్సిపల్ కమిషనర్ రవిచంద్రారెడ్డి గురువారం తెలిపారు. ప్రజలు ఈ మేరకు ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. జమ్మలమడుగు రోడ్డు విస్తరణ పనులు, మెయిన్ పైప్ లైన్ మరమ్మతులు, రామేశ్వరం హెడ్ వాటర్ వర్క్స్ ట్రీట్ మెంట్ ప్లాంట్ క్లీనింగ్ పనులు చేపట్టినట్లు తెలిపారు.