ప్రకాశం: బేస్తవారిపేట మండలం సోమవారిపేట గ్రామంలో శనివారం వీఆర్ఎ తిరుమలయ్యపై దాడి జరిగినట్లు ఎస్సై రవీంద్రారెడ్డి తెలిపారు. ప్రభుత్వంచే మంజూరు చేయబడిన గ్రామ కంఠం భూమిలో ఇల్లు నిర్మించుకునే పనులు చేపడుతున్న సమయంలో కొందరు వ్యక్తులు వీఆర్ఎపై దాడికి పాల్పడ్డారని బాధితుడు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెల్లడించారు.