NTR: విజయవాడలోని మధురానగర్ పప్పుల మిల్ సెంటర్ వద్ద ఉన్న రైల్వే గేటు ప్రాంతాన్ని ఎమ్మెల్యే బోండా ఉమాతో కలిసి ఎంపీ కేశినేని చిన్ని శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. మధురానగర్ పప్పుల మిల్ రైల్వే గేటు వద్ద ఆర్ యూబీ, ఆర్ వోబీ నిర్మాణం జరిగేలా కృషి చేస్తున్నామని అన్నారు. 2029 ఎన్నికల నాటికి రైల్వే పెండింగ్ ప్రాజెక్టు పూర్తి చేస్తామన్నారు.