ATP: గుత్తి మండలం ఎర్రగుడి గ్రామానికి చెందిన వీరేంద్ర అనే వ్యక్తి శుక్రవారం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కడుపునొప్పి భరించలేక పురుగుల మందు తాగి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే గుత్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.