ASR: వార్షిక తనిఖీల్లో భాగంగా జీ.మాడుగుల పోలీసు స్టేషన్ను గురువారం సాయంత్రం పాడేరు డీఎస్పీ షైక్ షహబాజ్ అహ్మద్ తనిఖీ చేశారు. ముందుగా ఆయన స్టేషన్లోని రికార్డులను పరిశీలించారు. పెండింగ్లో ఉన్న కేసులు, దర్యాప్తు, పురోగతి గురించి సీఐ బీ.శ్రీనివాసరావు, ఎస్సై షణ్ముఖరావును అడిగి తెలుసుకున్నారు. పెండింగ్లో ఉన్న కేసులు త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు.